జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ : ఏపీకి కేంద్రం శుభవార్త !

-

ఏపీ సిఎం జగన్ వరుస భేటీలతో ఢిల్లీ టూర్ ముగించుకున్నారు. నిన్న అమిత్ షాతో సహ ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సిఎం జగన్.. ఇవాళ ఉదయం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. గంటకుపైగా ఇరువురి మధ్య జరిగిన సమావేశం జరిగింది. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై ఈ సందర్బంగా చర్చ జరిగింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని జగన్ గుర్తు చేశారు. హెచ్‌పీసీఎల్‌ – గెయిల్‌ సంస్థలు కలిసి 1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ. 32,900 కోట్లు ఖర్చుకాగల ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేశాయని…వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రం కోరిందని తెలిపారు సీఎం జగన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కు తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్రమంత్రి ప్రధాన్‌ను కోరిన సీఎం…స్టీల్‌ ప్లాంట్‌ వల్ల దాదాపు 20వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని, అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్పులు చేయాలని, రుణాలను ఈక్విటీగా మార్చాలని కోరారు సీఎం జగన్. సిఎం జగన్ వినతులపై సిఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ చీఫ్‌ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు చెప్పిన కేంద్ర మంత్రి…విధివిధానాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news