పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది అని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణా శాసన సభలో ఆయన మాట్లాడుతూ సుధీర్గ ప్రసంగం చేసారు. గ్రామాల్లో 2020-21 కి 23 కోట్ల నుంచి 54 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని నిర్ణయించాం అన్నారు.
నిధుల వినియోగంలో పారదర్శకత పెరగాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాం అన్నారు. వార్షిక పంచవర్ష ప్రణాలికలు అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 45 మది ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల నేతృత్వంలో ఫ్లైయింగ్ స్వ్క్వాడ్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేకలు మార్చాలని చెప్పారు. ఆసరా పెన్షన్లతో సామాజిక భద్రత పెంచామని అన్నారు.
గ్రామ పంచాయితి ఉద్యోగులకు రెండు లక్షల బీమా కల్పించామని అన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. గ్రామాల్లో డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేసామని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయితీలో 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కుల వృత్తులకు చేయూత నిస్తున్నామని అన్నారు.
పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు స్టాండింగ్ కమిటీ లు ఏర్పాటు చేసామని అన్నారు. ప్రణాళిక బద్దంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గ్రామాల వికాసానికి దశల వారీగా కృషి చేస్తున్నామని అన్నారు కెసిఆర్. గ్రామాల ముఖ చిత్రాలు మార్చాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు కెసిఆర్. గిరిజన గూడాలని గ్రామ పంచాయితీ లుగా మార్చామని చెప్పారు. తడిపొడి చెత్తను వేరు చెత్తను వేరు చెయ్యాలని,
ఆ చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చెయ్యాలని అనుకున్నామని అన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు. గ్రామాలు అభివృద్దికి సూచికగా నిలవాలి అన్నదే ప్రభుత్వ ద్యేయమని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందడమే తమ లక్ష్యమని కెసిఆర్ స్పష్టం చేసారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్నామని, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.