రాజస్థాన్ లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టో లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కూడా తమ మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది. ఇందులో చాలా కీలకమైన అంశాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. ఇందులో అయిదు సంవత్సరాలలో 2 .5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నడ్డా మరియు వసుంధర రాజే ప్రకటించారు. ప్రతి ఒక్క ఆడపిల్ల మీద రూ. 2 లక్షల పొదుపు బాండ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక చదువుకుంటున్న పిల్లలు 6వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ చేస్తున్న మహిళల వరకు ప్రతి సంవత్సరం లక్ష వరకు సహాయాన్ని అందించనున్నారు.
అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థినులకు ఫ్రీగా స్కూటీలను అందించనున్నారు. ఇక కేవలం రూ. 450 లకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. ఇంకా ఇలాంటి ఎన్నో హామీలను ఇవ్వగా, ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నారు.