చిదంబరానికి సుప్రీంకోర్టు షాక్‌..

-

బండ్లు పోయి ఓడ‌ల‌వుతాయి… ఓడ‌లు కాస్త బండ్లు అవుతాయ‌నే సామేత అక్ష‌రాల కాంగ్రెస్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రంకు అతికిన‌ట్లు స‌రిపోతుంది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను రూపొందించిన చ‌ట్టాలే ఇప్పుడు ఆయ‌న‌కు య‌మ‌పాశాలు అవుతున్నాయి. అస‌లు విష‌యానికి వ‌స్తే..   కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరంకు సుప్రీకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది.


ఆర్థిక నేరాల కేసుల్లో ముందస్తు బెయిల్‌కు అనుమతివ్వడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని ఈ నేపథ్యంలో సుప్రీం తెలిపింది. ఐఎన్ఎక్స్‌  కేసుకు సంబంధించిన  వాస్తవాలను, ఇంతకు ముందు జరిగిన పలు ఘటనలను పరిగణలోకి తీసుకున్నామని, ముందస్తు బెయిల్‌కు ఇది తగిన పిటిషన్‌ కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కి పూర్తి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు పేర్కొంది.

కేసు ఈ దశలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్‌ ఇస్తే విచారణకు అంతరాయం కలగవచ్చని.. సుప్రీం అభిప్రాయపడింది. కాగా, సుప్రీం కోర్టు.. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించడంతో చిదంబరానికి భారీ షాక్ తగిలినట్టైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్న చిదంబరం..ఈడీ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ గత నెలలో సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news