డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం చేయడంపై తమ్ముడు అసంతృప్తి…

-

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకుడు మరియు మాజీ సీఎం అయిన సిద్దరామయ్యను తాజాగా ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. దాదాపు అయిదు రోజుల సుదీర్ఘమైన చర్చల అనంతరం కాంగ్రెస్ హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా సీఎం రేసు లో ఉన్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం గా ప్రకటించింది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై డీకే శివకుమార్ వర్గాలు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా డీకే శివ కుమార్ తమ్ముడు సురేష్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాకు ఏమాత్రం సంతోషంగా లేదని అన్నారు.

మేము అంతా డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకున్నాం అని తెలిపారు. డీకే సీఎం అయితే రాష్ట్రము బాగుంటుందని ఆశించమని, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి డీకే కట్టుబడి ఉన్నారని. ఇక కాంగ్రెస్ అభివృద్ధి కోసం మేము చాల కృషి చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news