దేశంలోనే అతి పెద్ద సర్వే.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయని చెప్పిందంటే?

-

ఏ నోట చూసినా వైఎస్సార్సీపీ ప్రభంజనమే. ఎవరు మాట్లాడుకున్నా వైసీపీ గురించే. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి.. వైసీపీని ఏపీ ప్రజలు గెలిపించబోతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి..

ఇది ఎన్నికల సమయం. అందుకే సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ ఓడిపోతుంది.. అంటూ సర్వేలతో బిజీ బిజీగా ఉంటుంది. ఏపీలో అయితే ఇంకా 24 రోజులే ఉన్నాయి ఎన్నికలు. ఈసందర్భంగా దేశంలోనే అతి పెద్ద సర్వే సీపీఎస్.. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ ఏపీలో సర్వే చేసింది. ఈ సర్వేలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చింది. వైఎస్సార్సీపీకి 122 సీట్లు, టీడీపీకి 53 సీట్లు వస్తాయని తేల్చింది.

survey reveals how many seats will be won by all parties in ap

జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

  • శ్రీకాకుళం(10)- వైఎస్సార్సీపీ -07, టీడీపీ -03
  • విజయనగరం(09)-వైఎస్సార్సీపీ -06, టీడీపీ-03
  • విశాఖపట్టణం(15)-వైఎస్సార్సీపీ -09, టీడీపీ-06
  • తూర్పుగోదావరి(19)-వైఎస్సార్సీపీ -09, టీడీపీ-10
  • పశ్చిమగోదావరి(15)-వైఎస్సార్సీపీ -09, టీడీపీ-06
  • కృష్ణా(16)-వైఎస్సార్సీపీ -07, టీడీపీ-09
  • గుంటూరు(17)-వైఎస్సార్సీపీ -12, టీడీపీ-05
  • నెల్లూరు(10)-వైఎస్సార్సీపీ -08, టీడీపీ-02
  • ప్రకాశం(12)-వైఎస్సార్సీపీ -12, టీడీపీ-00
  • కర్నూలు(14)-వైఎస్సార్సీపీ -12, టీడీపీ-02
  • కడప(10)-వైఎస్సార్సీపీ -10, టీడీపీ-00
  • అనంతపురం(14)-వైఎస్సార్సీపీ -10, టీడీపీ-04
  • చిత్తూరు(14)-వైఎస్సార్సీపీ -11, టీడీపీ-03




ఇక.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకోలేకపోయినా.. కొంతమేరకు ఓట్ల శాతాన్ని మాత్రం పొందుతుందట. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఓటు బ్యాంకు ఉంది.

వైఎస్సార్సీపీ గెలిచే 122 ఎమ్మెల్యే సీట్లలో.. 19 సీట్లలో గట్టి పోటీనే ఉంటుందట. వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ ఉంటుందట. నువ్వా.. నేనా అన్నంత పోటీ ఈ 19 సీట్లలో ఉంటుందట. అవి ఏంటంటే…


1.పాతపట్నం
2.-పాలకొండ
3.-పార్వతీపురం
4-సాలూరు
5-మాడుగుల
6-పాయకరావుపేట
7-పత్తిపాడు
8 -కొత్తపేట
9 -జగయ్యపేట
10 -తెనాలి
11 -ప్రత్తిపాడు(ఎస్సీ)
12 -సంతనూతలపాడు(ఎస్సీ)
13 -కొండెపి
14 -కోడూరు
15 -ఆళ్లగడ్డ
16 -నంద్యాల
17 -మదనపల్లె
18 -తిరుపతి
19 -శ్రీకాళహస్తి

Read more RELATED
Recommended to you

Latest news