100 కోట్ల డైరక్టర్ కు ఓకే చెప్పిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్న మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడితోనే మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు సూపర్ హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అనీల్ రావిపుడి. మహేష్, అనీల్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా గురించి త్వరలో ఎనౌన్స్ మెంట్ రానుందట.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ పరశురాం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ ఎప్పటి నుండో మహేష్ తో సినిమా ఉంటుందని తెలిసిందే. పరశురాం డైరక్షన్ లోనే ఆ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల డైరక్టర్ గా పరశురాం సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రీసెంట్ గా మహేష్ ను కలిసిన పరశురాం ఓ లైన్ డిస్కస్ చేశాడట.

లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. పరశురాం కు ఛాన్స్ ఇస్తున్నాడు అంటే కచ్చితంగా కథలో దమ్ము ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ డైరక్టర్స్ నే నమ్ముకుంటే పని అవదని తెలుసుకున్న మహేష్ యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. మరి పరశురాం, మహేష్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.