రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపోటములు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయని చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులందరూ ప్రజలకు చేరువ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్. అటువంటి నియోజకవర్గాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సనత్ నగర్. ఇది ఒకప్పటి టిడిపి బిజెపి కంచుకోట కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ను బిఆర్ఎస్ కు కంచుకోటగా మార్చారని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. సనత్ నగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశధర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ నుంచి జర్నలిస్ట్ కోటా నీలిమ బరిలో ఉన్నారు. బిఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్, బిజెపి మధ్య మాత్రమే రసవత్తర పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సనత్ నగర్ అభివృద్ధిలో శ్రీనివాస్ యాదవ్ పాత్ర చెప్పుకోదగినది. రాణిగంజ్ లేక్ వ్యూ, మెట్ల బావి, సనత్ నగర్ నాలా పై బ్రిడ్జి, బస్తీలో రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఐడిహెచ్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవన్నీ తలసాని నియోజకవర్గ ప్రజలకు అందించిన అభివృద్ధి కార్యక్రమాలు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో హోటల్లో, హోటల్ వలన తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఒక్కటే తలసానికి మైనస్. బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధితో పాటు, తలసాని సనత్ నగర్ కు చేసిన అభివృద్ధిని కలిపి చూస్తే ఈసారి ఎన్నికల్లో విజయం ఏకపక్షమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.