హుజురాబాద్ పోరు: ఈటెల వర్సెస్ కౌశిక్

-

హుజురాబాద్ ఇది ఈటెల  కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అనూహ్య పరిణామాల మధ్య పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పలుమార్లు ఈటలను గెలిపించిన హుజురాబాద్ ప్రజలు ఈసారి ఈటెలను అంగీకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

హుజురాబాద్ లో త్రిముఖ పోటీ ఉందని తెలుస్తోంది. బిజెపి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయగా, బిఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఒడితల ఫ్యామిలీ లోని వారసుడు ప్రణవ్ బాబు పోటీ చేస్తున్నాడు.

ఈటెల గజ్వేల్ లో కేసీఆర్ పై కూడా పోటీ చేస్తున్నారు. దీంతో పూర్తిగా హుజురాబాద్ పై ఫోకస్ పెట్టలేని పరిస్థితి. అయినా హుజురాబాద్ ప్రజలు ఈటెల కు మద్దతు గానే ఉన్నారు. అటు కాంగ్రెస్ కూడా కాస్త పోటీలో ఉంది.

రాష్ట్రంలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇవన్నీ ఈసారి కౌశిక్ రెడ్డి నే గెలిపిస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

మరి ఎన్నికలవేళ హుజూరాబాద్ ప్రజలు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే…

Read more RELATED
Recommended to you

Latest news