బరితెగించిన ఆకతాయి.. ఆ రాష్ట్ర సచివాలయానికి, సీయం ఇంటికి బాంబు బెదిరింపు.. ?

-

అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ అధికారులు కరోనా బిజీలో ఉంటే దుండగులు, దుర్మార్గులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్లుతున్నారు.. ఇంత విపత్కర పరిస్దితుల్లో కూడా క్రైమ్ రేటు ఏ మాత్రం తగ్గడం లేదు.. ఇదిలా ఉండగా ఒక యువకుడు ఏకంగా సచివాలయానికి, సీయం ఇంటికే బాంబు బెదిరింపు ఇచ్చాడట.. కావాలని చేసాడో, నిజంగానే ఉందని చేసాడో గానీ ఇలా చేయడం మాత్రం క్రైమ్ కిందికే వస్తుంది.. ఇంతకు ఏ రాష్ట్ర సచివాలయానికి ఈ బెదిరింపు వెళ్లింది అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా.. తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంటికి అక్కడి సచివాలయానికి ఈ బెదిరింపు వెళ్లిందట..

ఇకపోతే మెరీనా తీరంలోని కామరాజర్‌ సాలైలో తమిళనాడు రాష్ట్ర సచివాలయం ఉండగా, చెన్నై గ్రీవెన్స్‌ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం ఉంది. అయితే ఈ రెండింటికి కూడా బాంబు బెదిరింపు రావడంతో బాంబ్, డాగ్‌ స్క్వాడ్ రంగంలోకి దిగి సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. కాగా ప్రస్తుతం పోలీసులు బాంబు కాల్ చేసిన యువకుడి కోసం గాలిస్తు, ఆ ఫోన్ కాల్ ఎక్కడ్నుంచి యువకుడు చేశాడన్న విషయాన్ని ఆరా తీసే క్రమంలో ఆ కాల్ వచ్చిన ప్రాంతాన్ని ట్రాక్ చేసి జల్లెడ పట్టగా ఓ ఆకతాయి కుర్రాడు కావాలని ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాంబు బెదిరింపుకాల్‌తో ఎందుకైనా మంచిదని సీఎం ఇంటికి, సచివాలయానికి మరింత భద్రతను పెంచడమే కాకుండా ప్రవేశ మార్గంలో మెటల్‌ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేశారు…

Read more RELATED
Recommended to you

Latest news