సాధారణంగా మంత్రులు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్రులు అనే కాదు గాని రాజకీయ నాయకులు ప్రజల్లో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ నిజ స్వరూపం ఎలా ఉన్నా సరే దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రజల్లో ఉంటే కుదరదు. బానిస బతుకులు అనేవి ఇప్పుడు ఎక్కడా లేవు కాబట్టి ప్రజలను బానిసలుగా చూడటం అనేది తప్పు.
కాని ఒక మంత్రి మాత్రం 9వ తరగతి చదివే బాలుడితో చెప్పులు తీయించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని ముదుమలైలో ఆ రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా ఉన్న దిండిగల్ శ్రీనివాసన్ బందీగా ఉన్న ఏనుగుల కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ఆ సమయంలో కాస్త అక్కడ అహంకార పూరితంగా మంత్రి ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఎఐఎడిఎంకెకు చెందిన దిండిగల్ సి శ్రీనివాసన్ ఒక దళిత బాలుడితో తన చెప్పులు తీయమని ఆదేశించాడు. ఎం చెయ్యాలో అర్ధం కాక ఆ బాలుడు మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉన్న పెద్దలు కూడా అతని చుట్టూ నిలబడి నవ్వుతున్నారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మంత్రి వైఖరిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయనకు అంత అహంకారం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.