జగన్ రాజినామా జరిగేపని కాదుకానీ.. మరోమాట ఎత్తుకోండి!

-

ఏపీలో జగన్ తనపాలన తానుచేసుకుంటూ, పాలనా పరంగా, సంక్షేమ పథకాల పరంగా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు పనిలేకుండా చేశారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… ఏపీ సర్కార్ పై వెలువడుతున్న తీర్పులే ప్రతిపక్షాలకు వరంగా మారాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! జగన్ సర్కార్ పై ఏ విషయంపై విమర్శచేయాలన్నా… కోర్టు తీర్పులవైపు చూస్తున్న పరిస్థితి.

ఈ క్రమంలో మొన్న నిమ్మగడ్డ వ్యవహారంపై వచ్చిన తీర్పు సమయంలో ఫుల్ హడావిడి చేసిన ప్రతిపక్షాలు.. నిన్న జీవో 2430పై ఏపీ సర్కార్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు అనే కామెంట్లు వినిపించాయి. అనంతరం తాజాగా ఏపీలో పంచాయతీలు, సచివాలాయాలకు వైకాపా రంగులు మార్చాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేసరికి మళ్లీ మైకుల ముందుకు వచ్చేశారు! తమ కోరికలను బయటపెట్టడం మొదలుపెట్టారు.

సందర్భం ఏదైనా, సమయం ఏదైనా… ఏపీ ప్రతిపక్షాలు జగన్ పై చేస్తున్న విమర్శ, డిమాండ్ ఒక్కటే.. కోర్టులు ప్రభుత్వ జీవోలను తప్పుపడుతున్నాయి… జగన్ మోహన్ రెడ్డి రాజినామా చేయాలి! అవును… విషయం ఏదైనా సరే “జగన్ రాజినామా చేయాలి” అనే డిమాండునే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నాయి ప్రతిపక్షాలు. నిన్నటికి నిన్న.. నీలం సంజీవరెడ్డి పేరు చెప్పి, జగన్ రాజినామా చేసెయ్యాలని కోరిక కోరిన బాబు తరహాలోనే.. టీడీపీ నేత సోమిరెడ్డి కూడా రాజకీయాల్లో విలువల గురించి ప్రస్థావించేస్తూ… జగన్ రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ప్రజల తిరస్కారాన్ని పూర్తిగా పొందిన రాజకీయ నిరుద్యోగులకు ప్రధాన నివాసంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు తులసీ రెడ్డి సైతం.. ఇదే డిమాండ్ చేశారు. కాకపోతే ఆయన విలువల గురించి కాకుండా.. సిగ్గుంటే వెంటనే రాజినామా చేయాలని కోరారు!

సిగ్గు శరం గురించి, విలువలతో కూడిన రాజకీయాల గురించి ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ లు మాట్లాడుతుంటే “దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి” అని వస్తున్న కామెంట్ల సంగతి పక్కన పెడితే… 30ఏళ్లపాటు పాలిస్తాను అంటూ కుర్చీకి మేకులు బలంగా కొట్టుకుని కూర్చున్న జగన్ పై భ్రమలతో కూడిన “రాజినామా” విమర్శలు మాని, మరేదైనా పనికొచ్చే విమర్శలు చేస్తే, జనం కాస్త ఆలోచిస్తారేమో వీరు ఆలోచించుకోవాలని పలువురు సూచిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news