ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ ఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అసెంబ్లీ, మండలి సమావేశాల్లోనే నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ పై చర్చలో కూడా పాల్గొనాలని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు సూచించారు.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు నిర్ణయం తీసుకున్నారు. కాగ ఈ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఆయన తప్ప మిగితా అందరూ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కాగ గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర బాబు సతీమణి భూవనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను ఇక అసెంబ్లీలో అడుగు పెట్టబోనని చంద్రబాబు శపధం చేశారు.