టిడిపి ధ‌ర్మ‌పోరాట దీక్ష వాయిదా

-


క‌డప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్మ పోరాట దీక్ష వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్న సందర్భంగా వారం రోజుల నుంచి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి ప్రొద్దుటూరులో భారీ వర్షం కురిసింది. ఫలితంగా సభా ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. వేదిక, పరిసర ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. సభ నిర్వహణకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. ప్రాంగణాన్ని చదును చేయడం కష్టమని పార్టీ నేతలు భావించారు. శుక్ర‌వారం మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతా బురదమయంగా ఉండటాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. సభ వాయిదా వేయాలని నేతలకు సూచించారు. దీంతో ధర్మ పోరాట దీక్ష సభను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నేతలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version