వీరశివారెడ్డి ముందు నుంచి కూడా టీడీపీలో అసంతృప్తితోనే ఉన్నారట. టీడీపీతో అంటిముట్టనట్టుగానే ఉన్నారు. టికెట్ల కేటాయింపులోనూ ఆయన చెప్పినట్టు జరగకపోవడంతో… పార్టీ మారాలని అనుకున్నారట. కాకపోతే ఇప్పుడు జగన్ గెలుపు ఖాయం అని ఆయన తెలిసిందట.
ఎన్నికలతో సంబంధమే లేదు. వైఎస్సార్సీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార టీడీపీ పార్టీకి షాక్ లు ఇస్తూ ఎన్నికలు ముగిసినా కూడా వైఎస్సార్సీపీలో నేతలు చేరుతూనే ఉన్నారు.
పోలింగ్ ముగిసిన మరుసటి రోజే టీడీపీకి చెందిన కీలక నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి సమక్షంలో వీరశివారెడ్డి వైసీపీలో చేరారు.అయితే.. పోలింగ్ ముగిశాక ఎందుకు వైసీపీలో చేరారని వీరశివారెడ్డిని ప్రశ్నిస్తే.. ఏమన్నారో తెలుసా? వచ్చేది రాజన్న రాజ్యం. జగనన్న గెలువబోతున్నారు.
రాజన్న రాజ్యం వచ్చి అంతా మంచి జరగబోతోంది. కాబట్టే వైసీపీలో చేరానన్నారు. అంటే… ఏపీలో వైఎస్సార్సీపీ గెలవబోతోందని వీరశివారెడ్డికి ముందే తెలిసిపోయిందా? అసలు జగనే గెలుస్తారని ఆయనకు ఎవరు చెప్పారు? ఆయన అంచనాలు నిజమవుతాయా? అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.