వైసిపిలో చేరిన చంద్రబాబు.. వదల బాబు వదలా అంటున్న వర్మ..!

169

సంచలన దర్శకుడు ఆర్జివి ఏం చేసినా అదో సంచలనమే.. ఎలక్షన్స్ ముందు దాకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా గురించి నానా హంగామా చేసిన ఆర్జివి ఆ సినిమాను ఏపిలో రిలీజ్ కు అడ్డుపడిన సిఎం చంద్రబాబు నాయుడిని ప్రత్యక్షంగా, పరోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఇక జరిగిన ఏపి ఎలక్షన్స్ లో పోలింగ్ శాతం అధికమవడం వల్ల గెలిచేది వైసిపీనే అని ఫిక్స్ అయ్యారు. వైఎస్ జగనే కాబోయే ఏపి కొత్త సిఎం అని అంటున్నారు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఆర్జివి మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అదిరిపోయే ఫోటో పెట్టాడు. ఏకంగా చంద్రబాబు నాయుడే వైసిపి కండువా కప్పుకుని జగన్ పార్టీలో చేరినట్టుగా ఫోటో మార్ఫింగ్ చేశాడు. ఇది అంతకుముందు ఉన్న ఫోటోనే అయినా వర్మ పోస్ట్ చేసేసరికి మరింత జనాలకు రీచ్ అవుతుంది.చంద్రబాబు మీద తన కసి ఇంకా తీరలేదు అనుకుంటా అందుకే ఆర్జివి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ ఫోటో చూసిన తెలుగు తమ్ముళ్లు వర్మ మీద సీరియస్ అవుతుంటే వైసిపి ఫాలోవర్స్ మాత్రం చివరకు అదే జరిగేది అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోతో మరోసారి వర్మ హాట్ న్యూస్ గా మారాడు.