వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసిన టీడీపీ…!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. అధికార పార్టీకి నాలుగు స్థానాలు కైవసం చేసుకునే సంఖ్యా బలం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే చర్చ పక్కన పెడితే… తెలుగుదేశం పార్టీ రాజ్యసభ బరిలో నిలవడం ఆశ్చర్యంగా మారింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ సభలో అత్యంత బలహీనంగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే ఒక్క రాజ్యసభ సీటుని కూడా దక్కించుకునే అవకాశాలు ఆ పార్టీకి లేవు అనే చెప్పాలి.

అయినా సరే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ని ఎన్నికల బరిలో నిలిపింది. దీని వెనుక వ్యూహం ఏంటీ అనేది తెలియకపోయినా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మంగళవారం చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. మాకు బలం లేకపోయినా సరే రాజ్యసభ బరిలో అభ్యర్ధిని నిలుపుతున్నామని అన్నారు. అలాగే… వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నారు.

దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా టీడీపీ నేతలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు. దీనితో వారికి చంద్రబాబు గాలం వేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రెండు జిల్లాల్లో అసహనంగా ఉన్నారు అనే ప్రచారం జరిగింది.

రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఏమైనా టీడీపీకి సహకరించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కాగా అధికార పార్టీ… మోపిదేవి వెంకటరమణ. పిల్లి సుభాష్ చంద్రబోసు, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను ఖరారు చేసింది. వీరు నలుగురు ఏకగ్రీవంగా రాజ్యసభకు వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. కాగా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news