మంగళగిరి నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినబాబు.. అదేనండి.. లోకేశ్ బాబు.. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. ఆ కసి ఆయనలోనే ఉంటే ఎలా.. దాన్ని బయటికి తీయాలిగా.
వేయాలి బాబు.. వేయాలి.. ఓటు మాకే వేయాలి.. ఓటు వంద, ఓటుకు రెండొందలు.. ఆ.. రావాలి బాబు.. రావాలి.. ఓటేయాలి బాబు.. వేయాలి.. మా అభ్యర్థికే వేయాలి.. చివరి పాట 500. రావాలి.. రావాలి.. ఆలోచించిన ఆశాభంగం.. 500 తీసుకో.. మా అభ్యర్థికి ఓటు గుద్దిపో.. అంటూ ప్రచారాలు చేయడం చూశారు కానీ.. ఓటుకు ఏకంగా 30 వేలు, 50 వేల రూపాయలు ఇచ్చే వాళ్లను ఎక్కడైనా చూశారా? ఓసారి మంగళగిరి వెళ్లొద్దాం పదండి.
మంగళగిరి నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినబాబు.. అదేనండి.. లోకేశ్ బాబు.. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. ఆ కసి ఆయనలోనే ఉంటే ఎలా.. దాన్ని బయటికి తీయాలిగా. కానీ.. లోకేశ్ బాబు తన కసిని తనలోనే దాచుకోవడంతో ఆయన గెలుపు కష్టమే అన్నట్టుగా ఉంది మంగళగిరిలో. దీంతో టీడీపీకి ఇష్టమైన అసలు అస్ర్తాన్ని బయటికి తీశారు. అదే డబ్బు ఎర. అవును.. మంగళగిరిలో టీడీపీకి ఓటేస్తే చినబాబు 50 వేలు ఇస్తా అంటున్నారట. చివరకు టీడీపీ నేతలు మాత్రం ఓటుకు 10 వేలు ఇచ్చారట. తర్వాత ఇంకో ఇరవై ఇస్తామని చెబుతున్నారట. మొత్తానికి 30 వేలు చేశారట. అయితే.. ప్రజలు మాత్రం… లోకేశ్ బాబు 50 వేలు ఇస్తానంటుంటే మీరేంది 10 వేలు మొహాన కొడుతున్నారని ఫైర్ అవుతున్నారట. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
అంతే కాదండోయ్.. హెరిటేజ్ పాల వ్యాన్లు, అనుకూల మీడియా ఓబీ వ్యాన్లు, పేపరు వ్యాన్లలో చంద్రబాబు డబ్బు మూటలు మంగళగిరికి తరలి వెళ్తున్నాయట. తమిళనాడు నుంచి చేపల పడవల్లో కూడా తీరప్రాంత జిల్లాలకు డబ్బు చేరవేస్తున్నారట. దోచుకున్న ప్రజాధనాన్ని వెదజల్లి ఓటర్లను కొనుగోలు చేయొచ్చనుకుంటున్నారు.. అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ వదిలారు.
మంగళగిరిలో ఓటు రేటును 30 వేలకు పెంచారు. ఇప్పటికే పంచిన 10 కాక మరో 20 వేలు ఇస్తామని కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చెబుతున్నారట. ప్రజలేమో లోకేశ్ బాబు ఓటుకు 50 వేలు ఇవ్వమంటే మీరు మధ్యలో బొక్కి మా మొఖాన 10 కొడతారా అని తరుముతున్నారట. మందలగిరిని ఏం చేయాలనుకుంటున్నాడో మాలోకం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 5, 2019
హెరిటేజ్ పాల వ్యాన్లు, అను కుల మీడియా ఓబీ వ్యాన్లు, పేపరు వ్యాన్లలో చంద్రబాబు డబ్బు మూటలు తరలి వెళ్తున్నాయి. తమిళనాడు నుంచి చేపల పడవల్లో కూడా తీరప్రాంత జిల్లాలకు డబ్బు చేరవేస్తున్నారు. దోచుకున్న ప్రజాధనాన్ని వెదజల్లి ఓటర్లను కొనుగోలు చేయొచ్చనుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 5, 2019