అసలే గడ్డుకాలం .. అంతలో టీడీపీ కి మరొక తలనొప్పి !

-

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం భయంకరమైన ప్రమాదంలో పడింది. తెలంగాణలో చాలా వరకు కనుమరుగైన టిడిపి ఏపీలో కూడా అదే పరిస్థితికి వెళుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు ఇటీవల వరుస పెట్టి జరుగుతున్నాయి. ఈ దాడులలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు దగ్గర గత సార్వత్రిక ఎన్నికల వరకు పనిచేసిన మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి దగ్గర రెండు వేల కోట్లు సోదాలు అక్రమ సొమ్ము బయటపడినట్లు స్వయంగా ఐటీ శాఖ ప్రకటించింది. Image result for chandrababu headache

దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంలో టీడీపీ అసలు శ్రీనివాస్ చౌదరి కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని వాదన చేస్తోంది. మరోపక్క ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ నాయకులు…బాబు మీ దగ్గర రెండు వేల కోట్లు ఉంటే చంద్రబాబు దగ్గర రెండు లక్షల కోట్లు ఉండటం గ్యారెంటీ అని చంద్రబాబుపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇటువంటి గడ్డు కాలంలో తెలుగుదేశం పార్టీకి మరొక కొత్త తలనొప్పి తాజాగా ఎదురయింది. అదేమిటంటే చంద్రబాబు మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి దగ్గర సోదాలు చేస్తున్న సమయంలో 2014 నుండి 2019 వరకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పనులు మరియు కాంట్రాక్టుల విషయం గురించి డైరీ ఐటీ అధికారులకు దొరికినట్లు టిడిపి పార్టీలో టాక్. ఆ డైరీ లో చాలా మటుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల లావాదేవీలు ఉన్నట్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆ డైరీ గుట్టు మొత్తం ఐటీ విప్పితే ఆల్మోస్ట్ ఆల్ టిడిపి నాయకులలో చాలావరకు జైలుకెళ్లడం ఖాయమని వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో మాజీ పీఏ శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీ టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలే ముక్కుతూ మూలుగుతూ ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీకి ఐటీ దాడులు చావుదెబ్బ కొట్టినట్లే అని కూడా అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news