ప్రజా ప్రతినిధిగా ప్రజాసమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ ఎంపీలు కాస్త ఎక్కువే చదివారు. వారు చేసే ప్రతి పనీ అదేదో ఘనకార్యం వెలగబెట్టినట్టు చెప్పుకుని పొంగిపోతుంటారు. చిన్న గ్రామానికి రోడ్డేసి కాశ్మీరు టు కన్యాకుమారి వరకు రహదారి నిర్మించినంత బిల్డప్ ఇస్తారు.ఈ అవలక్షణం వారికే సొంతం. ఇలా గొప్పలు చెప్పుకుని తిరిగే టీడీపీ ఎంపీలు ఇటీవల వరుసగా నవ్వులపాలవుతున్నారు. ఓ ఎంపీ అయితే పీకల దాకా తప్ప తాగి పబ్బులో దొర్లుతూ జనాల నోళ్ళకు దొరికిపోయారు. ఆ ఎంపీ తీరుపై ప్రజలు మండిపోతున్నారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైనా ఆ పరపతిని సొంత విలాసాలకు వాడేస్తుంటారు చాలామంది.ఓ టీడీపీ ఎంపీ కూడా ఇలాంటి వెర్రివేశం వేశారు.ఆ ఘటనతో ప్రజలంతా ఆయనపై మండిపడుతున్నారు. ఈ ఘటనతో పరువు పోగొట్టుకుని రోజుల తరబడి ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎంపీలకు ప్రజా సమస్యల పట్ల ఇలాంటి చిత్తశుద్ధి ఉందని తూర్పారబడుతున్నారు.
టీడీపీకి చెందిన ఓ ఎంపీ ఇటీవల ఢిల్లీలో పబ్బుల్లో దర్శనమిచ్చారు.అంతేకాదు అక్కడే ఫుల్లుగా తాగి పడిపోయారట.మందు ఎక్కువ అయి డాన్సులు చేసి అలసి పడిపోయిన ఆయన్ను సహచరులు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేయడంతో సాధారణ స్థితిలోకి వచ్చారని తెలుస్తోంది.అయితే ఆ విషయం బయటకు రానివ్వకుండా ఉండేందుకు అదే పార్టీకి చెందిన ఇతర ఎంపీలు అక్కడి పోలీసులను సైతం మ్యానేజ్ చేశారని సమాచారం. ప్రజా సమస్యల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుని తిరిగే టీడీపీ ఎంపీలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.అయితే పబ్బులకు వెళ్లి డ్యాన్సులు చేయడమే కాకుండా తప్పతాగి పడిపోయారని సమాచారం తెలియడంతో టీడీపీ నేతలపై ప్రజల్లో ఉన్న కాస్త గౌరవం కూడా పోయిందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజల కోసం మంచి చేస్తారని భావిస్తే ఢిల్లీకి వెళ్లి ఇలాంటి వింత వేషాలు వేస్తున్నారా జనాలు తిట్టి పోస్తున్నారు.