చంద్ర‌బాబును పార్టీ సీనియ‌ర్లు లైట్ తీసుకుంటున్నారా..!

-

ఓట‌మి నైరాశ్యాన్ని త‌ర‌మికొట్టి, పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం నింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సీనియ‌ర్ నేత‌లు షాక్ ఇస్తున్నారు.  జిల్లాల వారీగా ప‌ర్య‌టిస్తూ.. నియోజ‌క‌వ‌ర్గాల వా రిగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న బాబుకు చుక్క‌లు చేపుతున్నారు.  అధికారం లేనంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేద‌ని, ప్రభుత్వ విధానాలపై పోరాటం మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేస్తున్న‌ప్ప‌టికీ అధినేత ఆదేశాల‌నే ధిక్క‌రిస్తున్నారు. తూర్పు గోదావారి జిల్లాలో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.


టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో, పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కానీ ముఖ్యమమైన సమావేశానికి జిల్లాలో కీలక నాయకులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది.  జిల్లాలో కాపు ఉద్యమ నేతల్లో ఒకరిగా పేరు పొందిన రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ సమావేశానికి హాజ‌రుకాలేదు. కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీలో కీలక నేతగా పేరొందిన బొడ్డు భాస్కర రామారావు సైతం ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు.

అయితే కీలకమైన సమావేశానికి నేతలు రాకపోవడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ప్రతి ఒక్కరూ హాజ‌రు కావాలని, పార్టీ పరంగా ఆదేశాలు జారీ చేసినా, వీరు బేఖాత‌ర్ చేయ‌డంతో బాబు కలత చెందినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కాపు నేతలందర్నీ కూడగట్టి సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పార్టీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఒకవిధంగా ధిక్కార స్వరమే అనుకోవాలి. ఎన్నికల నాటి నుంచి కూడా, తోట ఇలాంటి వైఖరే అనుసరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లు టీడీపీని వీడుతార‌న్న ప్రచారం కూడా జోరుగా సాగింది.

ప్రస్తుతం జిల్లా కీలక మీటింగ్‌కు గైర్హాజ‌రైన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కమలం పార్టీ వైపు చూస్తున్నారని, అందుకే మీటింగ్‌కు రాలేదని కార్యకర్తలు చ‌ర్చించ‌కుం టున్నారు. అంతేగాక కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు దొరబాబు కూడా, కాకినాడలోనే జరిగిన పార్టీ మీటింగ్‌కు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఈయనతో పాటు మరో పదిమంది కార్పొరేటర్లు కూడా స‌మావేశానికి గైర్హాజ‌ర‌య్యారు. మొత్తానికి పార్టీలో కార్యకర్తలు, నేతల్లో పునరుత్తేజాన్ని నింపాలని చంద్రబాబు నిర్వ‌హిస్తున్న జిల్లాలవారీగా విస్తృతస్థాయి సమావేశాల‌కు ప‌లువురు సీనియ‌ర్ నేతలు హాజరుకాకపోవడం అధినేతను కలవరపాటుకు గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news