రాజమండ్రి రూరల్ టికెట్ పై తెగని పంచాయతీ..

-

తూర్పుగోదావరి జిల్లాలోని టిడిపిలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.. ఒక్కో టిక్కెట్టుకు ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతూ ఉండడంతో టికెట్ తమకంటే తమకంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు.. మరొక పక్క జనసేన సైతం పొత్తులో భాగంగా టికెట్ తమకే వస్తుందని చెబుతున్నారు.. రాజమండ్రి రూరల్ టికెట్ పై పంచాయతీ కొనసాగుతూనే ఉంది.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి తనకే టికెట్ అంటూ ప్రచారం చేస్తుంటే.. పొత్తుల్లో భాగంగా టికెట్ తనకి దక్కుతుందంటూ జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కందుల దుర్గేష్ తన అనుచరులు వద్ద చెబుతున్నారు.. దీంతో క్షేత్రస్థాయిలో జనసేన వర్సెస్ టిడిపి గా మారింది.. తమ నియోజకవర్గంలో ప్రాబల్యం చూపలేని జనసేన నేతలకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని టిడిపి నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట.. ఈ క్రమంలోనే రూరల్ టికెట్ను బుచ్చయ్య చౌదరికి కేటాయించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది..

పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్య చౌదరి చంద్రబాబు నాయుడు కలిసి తనకు టికెట్ కన్ఫామ్ చేయాలని కోరారట.. జనసేన నేతలు క్యాడర్ ని అయోమయంలోకి పడేస్తున్నారని.. వివరించారట.. దీనిపై చంద్రబాబు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో బుచ్చయ్య వర్గం గుర్రుగా ఉంది.. గ్రామస్థాయిలో మాత్రం ఇరు పార్టీలకు చెందిన నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.. మరోపక్క పొత్తుల్లో భాగంగా రూరల్ టికెట్ జనసేనకి ఇస్తే.. సిటీ సీటు మాత్రం తనకే ఇవ్వాలని బుచ్చయ్య పట్టుబడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తుంది.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న భవానీని పార్లమెంటుకు పంపే ఆలోచనలో అధిష్టానం ఉండడంతో బుచ్చయ్య చౌదరి స్థానంపై ఆశలు పెట్టుకున్నారు..

తన భార్యకు టికెట్ ఇవ్వకపోతే అసెంబ్లీ టికెట్ తనకే ఇవ్వాలంటూ భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారట.. తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి తీరుతానని శ్రీనివాస్ చెబుతున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే జనసేన టిడిపి మధ్య టిక్కెట్ పైట్ అప్పుడే స్టార్ట్ అయిందని తెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news