టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. బీజేపీలోకి కీలక నేత?

-

సాంబశివరావు.. గుంటూరు జిల్లాకు చెందిన అత్యంత సీనియర్ నేత. కాకపోతే ఆయన పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. 2004లో తొలిసారిగా ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నలుగురు టీడీపీకి చెందిన ఎంపీలు, ఇతర నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వాళ్లంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడబోతున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవి.. రెండింటికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారట.

సాంబశివరావు.. గుంటూరు జిల్లాకు చెందిన అత్యంత సీనియర్ నేత. కాకపోతే ఆయన పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. 2004లో తొలిసారిగా ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

నాసా, ఇస్రోలలో సైంటిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది. యూఎస్ లో వివిధ ఐటీ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. అయితే.. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని ఆయన మనస్తాపం చెందారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ ఇన్ చార్జ్ గానూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news