భారతీయ జనతా పార్టీ అంటేనే సంప్రదాయాలకు విలువలకు పెద్దపీట వేసే పార్టీ.. ఆ పార్టీలో సీనియర్ నేతలకు పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.. కానీ మొదటిసారి సీనియర్ నేతలను పక్కనపెట్టి.. టిడిపిలోంచి బిజెపిలోకి జంపైన నేతలకే బిజెపి అధిష్టానం టిక్కెట్ల ఖరారు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర చర్చలకు దారితీసింది.. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకుంది.. ఈ క్రమంలో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న సత్య కుమార్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు ఆ పార్టీ నుంచి బరిలోకి దిగాలి.. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది..
మొదటినుంచి బిజెపికి విధేయులుగా ఉన్న ఒక్కరికి కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టిక్కెట్ ఖరారు చేయలేదు.. టిడిపి నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, గోనుగుంట్ల సూర్యనారాయణ పక్కా టిడిపి ముద్ర పడిన నేతలకే బిజెపి నుంచి టిక్కెట్లు ఖరారు అని ప్రచారం జరుగుతుంది.. వీరికి టిక్కెట్లు ఇప్పించడంలో రాష్ట్ర అధ్యక్షులు కీలకంగా వ్యవహరించారట.. పురందేశ్వరి ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్ర నాయకత్వం వీరికి టిక్కెట్లు ఖరారు చేసిందని పార్టీలో చర్చ నడుస్తోంది..
బిజెపిలో టిక్కెట్లు తీసుకున్న నేతలు అందరూ తెలుగుదేశం పార్టీకి నిధులు సమకూర్చే వారినట.. వారికి టిక్కెట్లు ఇప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు తెర వెనుక పురందేశ్వరిని పావుగా వాడుకున్నారని టాక్ వినిపిస్తోంది.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని.. కేంద్ర ప్రతినిధి బృందాన్ని పురందేశ్వరి చెప్పు చేతల్లో పెట్టుకుని చంద్రబాబు చెప్పిన వారికి టిక్కెట్లు ఖరారు చేసేలా నివేదికను అందించారట.. దీంతో బిజెపిలో పాత తరం నేతలుగా ఉన్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం రాలేదని బిజెపి నేతలు వాపోతున్నారు.. ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరుని నియమించిన క్షణం నుంచే ఏపీలో ఆ పార్టీ దిగజారి పోయిందని.. చంద్రబాబు చెప్పినట్లు పురందేశ్వరి నడుచుకుంటుందని పాత తరం నేతలు ఆరోపిస్తున్నారు.. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల ఖరారులో కూడా కోట్ల రూపాయలకు పురందేశ్వరి టిక్కెట్లు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై కొందరు నేతలు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారట.. పురందేశ్వరి వ్యవహరిస్తున్న తీరువల్ల ఏపీలో బిజెపి తీవ్రంగా నష్టపోతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు..