ఒకప్పుడు క్రికెటర్… ఇప్పుడు సిఎం అభ్యర్ధి…!

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనను క్రికెటర్ అని ఎగతాళి చేస్తూ మాట్లాడటంపై బీహార్ మహాకూటమి సిఎం అభ్యర్ధి తేజశ్వి యాదవ్ స్పందించారు. నితీష్ కుమార్ కు ఏమి అయింది ఇప్పుడు…? ఇంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కదా అలా ఎలా మాట్లాడతారు…? క్రికెట్, సినిమాల నుండి మనం రాజకీయాల్లోకి రాలేమా? వైద్యులు, ఇంజనీర్లు కూడా రాలేదా? ” అని ప్రశ్నించారు.

tejaswi yadv
tejaswi yadv

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కి నాయకత్వం వహిస్తున్న 31 ఏళ్ల తేజస్వీ యాదవ్… రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ఆయన ఢిల్లీ తరుపున ఐపిఎల్ కూడా ఆడాడు. తాను నాయకత్వ లక్షణాలు, టీం వర్క్… ఇవన్నీ నేను క్రికెట్ నుండి నేర్చుకున్నాను అని చెప్పారు. రేపు బీహార్ రెండో దశ పోలింగ్ జరుగుతుంది.