ఆ విషయమై తొలిసారి ఫైర్ అయిన తెలంగాణ సీఎం.. ఇగ లొల్లి లొల్లే..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యూహకర్తగా రాజకీయాల్లో మంచి పేరుంది. ఎప్పుడు ఏ విషయాన్ని ప్రస్తావించాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని ప్రతి‌పక్ష పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్తుండటం మనం గమనించొచ్చు. కాగా, ఆ విషయమై తాజాగా సీఎం కేసీఆర్ తొలిసారి స్పందించారు. అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

కృష్ణా, గోదావరి రివర్స్ బేసిన్‌లలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి నియంత్రణను ఆయా నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేస్తూ కేంద్రం ఇటీవల గెజిట్ జారీ చేసింది. దీనిపై కొద్ది రోజుల పాటు మౌనముద్ర దాల్చిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తాజాగా కొంచెం ఘాటుగానే స్పందించారు. ఏపీ సర్కారు దాదాగిరి చేస్తున్నదని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వంపైన ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. కృష్ణా నీళ్ల మీద ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఒకరకంగా రాజుకుంటుందేమో అనేంతలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇక భవిష్యత్తులో రణరంగం సృష్టించేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. అయితే, జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటేనే మంచిదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. అవసరమైతే తాను రాజ్యాంగ పరిధిలో మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా చెప్పారు. కానీ, తాజాగా తెలంగాణ సీఎం వ్యాఖ్యలతో చర్చలకు తావులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ నుంచి ఏపీ రాష్ట్ర సర్కరు తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి 30 టీఎంసీల వాటర్‌ను అనవసరంగా సముద్రం పాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎలాగూ ఎగువ ప్రాంతంలో ఉన్నామనే తెలంగాణ సర్కారు ఉద్దేశ పూర్వకంగా వాటర్ ఫైట్ సృష్టించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాటాను కాపాడుకోవడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సజ్జల వివరించారు. మొత్తంగా జలవివాదం రోజురోజుకూ ఇంకా బాగా ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news