రేపే తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

-

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించింది ప్రభుత్వం. ఈ నెల 25న ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను వెల్లడించనున్నట్లు ఉన్నత విద్యామండలి గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో… ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను కూడా ఈ నెల 10న విడుదల చేశారు.

telangana government issues grades to the promoted students

రేపు ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల కానుండగా… మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 30 న ప్రారంభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనుంది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news