కామసూత్ర అనగానే ముఖంలో ఒక చిన్నపాటి సిగ్గుతో కూడిన ముసి ముసి నవ్వు వస్తుంది. శృంగారానికి సంబంధించి కాబట్టి ఆమాత్రం సహజం. కానీ కామసూత్రలో సెక్స్ గురించిన పాఠాలు కొద్దిభాగం మాత్రమే ఉంటాయి. మిగతా మొత్తంలో జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలన్న విషయాలే ఉంటాయి. జీవితం గురించిన బోధనలు, సలహాల సమాహారమే కామసూత్ర. ఇతర దేశాల వారు కామసూత్రను సెక్సువల్ మ్యాన్సువల్ గా గుర్తిస్తారు. ఇది భారతదేశానికి చెందిన పురాతన గ్రంధం.
ఇందులో శృంగారం గురించే కాకుండా భావోద్వేగము, భావుకత ఉంటుంది. కామసూత్రలో మొత్తం 7 భాగాలు, 36 అధ్యాయాలు మరియు 1250 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి భాగం సాధారణ. ఇందులో జీవిత లక్ష్యం గురించి ఉంటుంది. అతడు లేదా ఆమె తన జీవితాన్ని ఎంత బాగా ఆకర్షణీయం చేసుకోవచ్చో చెబుతుంది.
రెండవ భాగం సంప్రయోగిక. ఇందులో ముద్దులు, కౌగిలింతలు, పంటిగాటు, లైంగిక ప్రేరణ, ప్రేమ ప్రకటనలో నోటి పని మొదలగు వాటి గురించి తెలియచెబుతుంది.
మూడవ భాగం కన్యా సాంప్రదాయ: వధువుని ఎలా కనుక్కోవాలి? ఆమె మనసు ఎలా గెలుచుకోవాలి అనే విషయాలను సూచిస్తుంది.
నాలుగవ భాగం భవ్యధికారిక, ఐదవ భాగం పారాడికథర్స్. ఆరవ భాగం వైశ్య.. ఈ భాగంలో లైంగిక దుష్ప్రవర్తన గురించి ఉంటుంది. ఇతరుల భార్యలతో ఎలా ఉండాలి? పడుపు వృత్తిలో పనిచేసే వారితో ఎలా మెలగాలి మొదలగు వాటిని చెబుతుంది.
ఏడవ భాగం ఆపమిషాధికా. ఇందులో సంతానంలో ఇబ్బందులు, కావాల్సిన మందులు, తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇతర విషయాలు ఉంటాయి.
ఈ భాగాలన్నింటిలో రెండవ భాగమైన సంప్రయోగికకి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది.