తెలంగాణ సచివాలయం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తుంది. గత నాలుగు దశాబ్ధాలుగా నిత్యం సైరన్ మోతలతో, ఎమ్మెల్యేల రాకతో, ఐఏఎస్, ఐపీఎస్, అధికారుల రాకపోకలతో నిత్యం కళకళలాడే సచివాయలం వెళవెళబోతు దర్శనమిచ్చింది. సచివాలయం రోడ్డు నిత్యం ప్రజల సందర్శనతో, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు నిత్యం వాహానాల రణగొణ ధ్వనులతో మారమ్రోగే ఈ ప్రాంతం ఇప్పుడు మూగబోయింది. టీఎస్ సచివాలయం త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో అక్కడ నుంచి మంత్రులను, హెచ్ ఓ డీలను ఖాళీ చేయించారు. దీంతో సచివాలయం మొత్తం ఖాళీ అయింది.
సోమవారం నుంచి మంత్రులకు, హెచ్ ఓ డీలకు కొత్త భవనాలను కెటాయించారు. ఇక ముందు మంత్రులను, హెచ్ ఓ డీలను కలిసే ప్రజలు సచివాలయంకు వెళ్ళకుండా నేరుగా వారికి కెటాయించిన కార్యాలయాలకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఏమంత్రికి ఎక్కడ కార్యాలయాలు కెటాయించారో ఇప్పుడు అంతా గందరగోళంగా మారింది. అయితే తెలంగాణ సర్కారు మంత్రులకు కెటాయించిన కార్యాలయాలల్లో విధులను నిర్వహించనున్నారు. ఇక పోతే వారికి కెటాయించిన ఆఫీసులు ఎక్కడో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది సర్కారు.
సచివాలయంలోనూ, మీడియాలోనూ, సోషల్‌మీడియాలోనూ కార్యాలయాలను మార్చిన ప్రదేశాలపై విస్తృతమైన ప్రచారం చేస్తుంది. సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ ఎలాగు ఉంది కాబట్టి సమస్య లేదు. ఇక ఐటీ మంత్రికి మసాబ్‌ట్యాంక్ ఏసీగార్డ్స్‌లోని మున్సిఫల్ భవన్‌లో కెటాయించగా, మంత్రి హరీష్‌రావుకు అరణ్య భవన్‌ను కెటాయించారు. ఇలా మంత్రులకు శాఖపరమైన కార్యాలయాలను కెటాయించింది సర్కారు. మంత్రుల కార్యాలయాలు ఇలా ఉన్నాయి.
మంత్రుల కార్యాలయాలు
1. ముఖ్యమంత్రి – హెచ్ఎంఆర్ఎల్, రసూల్ పురా, బేగంపేట్.
2. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. డీజీపీ కార్యాలయం, లక్డీకాపూల్.
3. ఈటల రాజేందర్ – బీఆర్కేఆర్ భవన్.
4. ఇంద్ర కరణ్ రెడ్డి – ఎండోమెంట్ కార్యాలయం, బోగ్గులకుంట, అబిడ్స్.
5. కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ భవన్.
6. ఎరబెల్లి దయాకర్ రావు – రంగారెడ్డి జడ్పీ కార్యాలయం, ఖైరతాబాద్.
7. జగదీష్ రెడ్డి – టీఎస్ఎస్పీడీపీఎల్, మింట్ కాంపౌండ్.
8. నిరంజన్ రెడ్డి – హాకా భవనం, లక్డీకాపూల్.
9. వి. శ్రీనివాస్ గౌడ్ – రవీంద్ర భారతి, లక్డీకాపూల్.
10. మల్లారెడ్డి – మహిళా శిశు సంక్షేమ భవన్, రోడ్ నెంబర్: 45, జూబ్లీహిల్స్.
11. తలసాని శ్రీనివాస్ యాదవ్ – బీఆర్కేఆర్ భవన్.
12. ప్రశాంత్ రెడ్డి – ఈఎన్సీ, ఎర్రమంజిల్.
13. కేటీఆర్ – మునిసిపల్ కాంప్లెక్స్, ఏసీ గార్డ్స్, మాసబ్ టాంక్.
14. హరీష్ రావు – అరణ్య భవన్, లక్డీకాపూల్.
15. సత్యవతి రాథోడ్ – సంక్షేమ భవన్.
16. గంగుల కమలాకర్ – బీసీ కమిషన్, ఖైరతాబాద్.
17. పువ్వాడ అజయ్ – రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్, ఖైరతాబాద్.
18. సబితా ఇంద్రారెడ్డి – ఎస్సీఈఆర్టీ, బషీర్‌బాగ్.