వాళ్ళ నోళ్ళు మూయించిన తెలంగాణా ప్రజలు…!

-

తెలంగాణాలో విపక్షాలు పదే పదే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఉద్దేశించి నియంత అంటూ విమర్శలు చేస్తూ ఉంటాయి. చివరకు ప్రజల మద్దతు ద్వారా గెలిచిన అసెంబ్లీ ఎన్నికలను ఆధారంగా చేసుకుని ఆ ఎన్నికల్లో తెరాసకు అన్ని స్థానాలు ఎన్నికల సంఘం ద్వారానే వచ్చాయి అంటూ అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస కు 8 స్థానాలు మాత్రమే రావడంతో దూకుడు పెంచారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా ఆ విమర్శలు కాస్త వెనక్కు తగ్గాయి. 40 వేల మెజారిటి చూసి నోరు వెళ్ళబెట్టారు అందరు. ఆ సమయంలో ఆర్టీసి ఉద్యమం జరగడంతో పాటుగా కొన్ని ఉద్యమాలు జరిగాయి. వాటిని తెరాస వ్యతిరేక పవనాలుగా చూపించే ప్రయత్నం విపక్షాలు చేసాయి. అయితే మున్సిపల్ ఎన్నికల దెబ్బకు అందరూ కంగు తిన్నారు.

వాళ్ళు అన్నట్టు ఇవి ఈవియెం ఓట్లు కావు, బ్యాలెట్ పేపర్ ఓట్లు. తెలంగాణా ప్రజల్లో తెరాస మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, వాళ్లకు చాలా సమస్యలు ఉన్నాయని, కెసిఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని పదే పదే విపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు అన్ని కలిపి పది స్థానాలు కూడా సాధించిన పరిస్థితి లేదు. బిజెపి కంటే ఏ హడావుడి లేని ఇతరులు మూడు స్థానాలు సాధించారు.

కెసిఆర్ ను నియంత అన్న వాళ్ళకు ప్రజలు ఇప్పుడు తమ తీర్పుతో సమాధానం చెప్పారు. ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తెలంగాణాను పాలించే అర్హత తెలంగాణాను సాధించిన అర్హత ఒక్క తెరాస కు మాత్రమే ఉందని చాటి చెప్పారు. కెసిఆర్ మీద పదే పదే విమర్శలు చేసే, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలు ఊహించని దెబ్బ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news