బ్రేకింగ్ : పూర్తయిన సచివాలయం కూల్చివేత

-

తెలంగాణా సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయం నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం సచివాలయ భవనాలను ప్రభుత్వం కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సచివాలయ భవనాల కూల్చివేత పనులు నేటితో పూర్తి అయ్యాయి. సచివాలయంలో ఉన్న మొత్తం 11 బ్లాక్‌ల కూల్చివేతల్లో భాగంగా ఈరోజు చివ‌ర‌గా ఎల్ బ్లాక్ ను కూల్చివేశారు. ఇక కూల్చివేతల ప్రక్రియ ముగియడంతో ఆ మిగిలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలు కానుంది.

శిథిలాల నుండి ఇనుము, కంకర, అల్యూమినియం ఇతర సామాగ్రిని సిబ్బంది వేరు చేస్తున్నారు. వ్యర్ధాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందంని అధికారులు చెబుతున్నారు. ఇక సచివాలయ భవనాల కూల్చివేత పనులను మీడియా ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ముందు కూల్చివేత ప్రక్రియ రహస్యంగానే జరిగినా అది మీడియా సమక్షంలో జరగాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కూల్చివేత, వ్యర్థాల తొలగింపును దగ్గరుండి చూసి వార్తల సేకరించే అవకాశం మీడియాకి లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news