ఏపీ రాజధాని వ్యవహారం ఇప్పట్లో తేలదా…?

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో రాజధాని అంశంపై విచారణలు జరుగుతున్నాయి. హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ విచారణకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించారు. అమరావతి రాజధానికి సంబంధించి రిట్ పిటిషన్స్ 229 ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి మధ్యంతర ఉత్తర్వులు కోసం కోర్ట్ ముందుకు వచ్చాయని చెప్పారు. వీటిని వర్గీకరించి బ్యాచ్ లుగా విభజిస్తున్నారని అన్నారు. ఇళ్లపట్టలు కు సంబంధించి లిటీగషన్స్ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఏ జి కోరారు. ప్రాధాన్యత రాజధాని కేస్ లకే ఇస్తాము అని సీజే స్పష్టం చేసారని అన్నారు.

రిట్ పిటిషన్ లు ఒక్కొక్కటి ఒకొక్క రిలీఫ్ కోరుతున్నాయి అలా ఉన్న వాటిని ఒక బాచ్ గా చేయాలని సీజే ఆదేశించారని, పోయిన వాయిదా రోజు విశాఖ కు సంబంధించి సీఎస్ ను అఫిడవిట్ వేయాలన్నారని వివరించారు. 29 న సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని, పూర్తి స్థాయి వివరాలు ఇవ్వలేదు అని పిటిషనర్ వాదన వినిపించారని చెప్పుకొచ్చారు. విశాఖ గెస్ట్ హౌస్ ఖర్చు వివరాలు అఫిడవిట్ లో ఎందుకు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా చెప్పారు. రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో ఉన్నదని,

30 ఎకరాల్లో విశాఖలో గెస్ట్ హౌస్ ఎందుకు అనే వాదనలు కొనసాగాయని పేర్కొన్నారు. తిరుపతి కాకినాడ లలో అంతా అవసరం లేదు అని ఏ జి వివరణ ఇచ్చారని అన్నారు. గెస్ట్ హౌస్ రాజధాని తరలింపుకు సంబంధం లేదు అని ప్రభుత్వం పేర్కొందని అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. హైబ్రిడ్ విచారణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెయ్యొచ్చు అయితే పూర్తిస్థాయి విచారణ భౌతికంగా జరిపే అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారట. రెపటినుంచి ఉదయం 10 నుండి 1.30 వరకు రాజధాని కేస్ ల పై విచారణ ఉంటుందని… ఇవి 2,3 నెలలు పట్టొచ్చు అని… ధర్మాసనం పేర్కొందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news