వివేకా కేసు: నేతల్లో మళ్ళీ హడల్

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ హత్యకేసుకి సంబంధించి మొత్తం వివరాలను సిబిఐ కి ఇవ్వాలని పులివెందుల కోర్టును నిన్న హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. త్వరలో విచారణకు సిబిఐ కొత్త బృందం రంగంలోకి దిగుతుంది.

కొత్త బృందం రాకతో ఈసారి అయినా కేసు కొలిక్కి రావచ్చని ఆయన కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివేకా కేసు విచారణకు సంబందించి కొందరు రాజకీయ నాయకుల్లో మళ్ళీ ఆందోళన మొదలయింది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 1300 మందికి పైగా సిబిఐ అధికారులు విచారించారు. అయినా సరే ఆధారాలు లభ్యం కాలేదు.