నిర్భయ అత్యాచారం హత్య ఘటనలో దోషులకు ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీయడం జరిగింది. 2012 వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటన దేశాన్ని మరియు ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు అన్న ముద్ర ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ద్వారా పడింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత నిర్భయ కేసులో నలుగురు నిందితులు ఉరిశిక్ష పడటం తో యావత్ దేశం ఇప్పుడూ సంబరాలు చేసుకుంది. అయితే ఉరిశిక్ష అమలు కోర్టు ఖరారు చేశాక జైల్లో నలుగురు నిందితులు చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. వినయ్ శర్మ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. ఇక పవన్ గుప్తా జైలు అధికారులను దూషించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఉరిశిక్షకు తీసుకెళ్ల కు ఆఖరి కోరిక ఏమిటి అని పోలీసులు అడుగగా 24 గంటల ముందే ఏమి వద్దు అని రిప్లై ఇచ్చాను. అయితే ఉరిశిక్ష అమలుకు ముందు నలుగురు నిందితులను స్నానం చేయించి వేర్వేరు రూముల్లో ఉంచి ఆ తర్వాత ఉరి వేశారట.