బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం తరలిపోనున్న ముఖ్యనేతలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు రాజకీయ ఆయువుపట్టులా కనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి చెందిన 35 మంది నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీని కలవడం. ఈ నాయకులలో రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ప్రస్తుత జిల్లా పరిషత్ అధ్యక్షుల వరకు ఉన్నారు.ఖర్గే, రాహుల్‌తో భేటీ అనంతరం కేసీఆర్ పార్టీకి చెందిన ఈ నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

జూలై 2 న ఖమ్మంలో నిర్వహించనున్న ర్యాలీకి ప్రియాంక గాంధీ విచ్చేయనున్నారు. ఈ ర్యాలీకి BRS నుండి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు నాయకత్వం వహించడమే కాదు వారి బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీలతో సుమారు గంటన్నరపాటు జరిగిన సంభాషణలో పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్ నేతలు అంగీకరించారు.ఈ బీఆర్‌ఎస్ నేత‌లు కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించ‌డం ఎన్నిక‌ల‌కు ఐదు నెల‌ల ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి పెద్ద ఎదురుదెబ్బ‌ అనుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక దాదాపు 10-15 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ ప్రభావం చూపుతుంది.

పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ నేతలు పలు దఫాలు చర్చిలు జరిపిన సంగతి తెలిసిందే.బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయన కొన్ని దఫాలుగా చర్చలు జరిపారు. కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు టర్న్ తీసుకోవడం ప్రారంభించాయి.దీంతో పొంగులేటి అంతిమంగా కాంగ్రెస్ గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇదిలా ఉండగా, విపక్షాల ఐక్య సమావేశాన్ని దాటవేయాలన్న కేసీఆర్ వ్యూహం తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ముందుగా బీజేపీతో చర్చలు జరిపి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసరెడ్డి నిర్ణయమే ఇందుకు ఉదాహరణ.

అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన పలువురు సీనియర్ నేతలు కూడా త్వరలో తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొంగులేటితో పాటు తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు.ఈ నేతల సమావేశాల అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు మొత్తం మార్పు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా గాలి వీస్తున్నందున త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news