ఎంజీబిఎస్ లో భయపెడుతున్నారుగా..?

రాష్ట్ర ప్రభుత్వం సడెన్ గా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్ళిపోవడానికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కాస్త కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్ ఎంజీబిఎస్ లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఎంజీబిఎస్ జే బి ఎస్ బస్టాండ్ లు ప్రజలతో కిట కిటలాడుతున్నాయి. తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు నగర జనం పోటీ పడుతున్నారు.

రద్దీకి అనుకూలంగా బస్సులు లేకపోవడం తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో నిలబడి సైతం తమ ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్ళడం గమనార్హం. ఇక లాక్ డౌన్ ని సడెన్ గా ప్రకటించడం పట్ల తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా రేపటి నుంచి తెలంగాణాలో 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.