ఫలితాల టెన్షన్ పై ఏపీ ప్రజానికం అభిప్రాయం ఇదేనంట..

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఈసీ అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. ఈ సమయంలో ఫలితాలు ఎలా రాబోతున్నాయనే ఉత్కంట ప్రతి ఒక్కరిలోనూ కొనసాగుతున్న పరిస్థితి. ఈ సమయంలో నెట్టింట మీమ్స్ & రీల్స్ హల్ చల్ చేస్తున్నాయి.

అవును… ఏపీలో కౌంటింగ్ సందర్భంగా నెలకొన్న ఉత్కంఠ, టెన్షన్ పై రీల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరోపక్క రాజకీయ పార్టీలు, నేతలూ ఎవరి ధీమాలో వారున్నారు. ఇందులో కొంతమంది ధైర్యంగా బయటపడుతుండగా.. మరికొంతమంది అల్ప విశ్వాసంతోనో ఏమో కానీ ఓపెన్ అవ్వడం లేదు! వాస్తవానికి మళ్లీ గెలుస్తున్నాం, జూన్9 న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అని అటు వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా… అదేరోజు అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం అంటూ కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

ఇలా రెండు వైపులా ధీమా కనిపిస్తుండటంతో.. ప్రజలలో మరింతగా టెన్షన్ పెరుగుతుంది. ఇందులో భాగంగానే… ఇంతకీ ఎవరు గెలుస్తున్నారు.. ఎవరు పరాజయం పాలవుతున్నారు.. ఏపీ రాజధాని విశాఖ కాబోతుందా.. అమరావతి కంటిన్యూ అవ్వబోతుందా.. అనే ప్రశ్నలతో కూడిన టెన్షన్ ఏపీ ప్రజానికానికి పీక్స్ కి చేరిందని అంటున్నారు. అయితే.. మరోవైపు జగన్ గెలుపు ఖాయమన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన అందించిన పథకాలే గెలుపుకు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news