ప్రధాని మోదీకి నిద్ర లేకుండా చేస్తున్న ఈ ముగ్గురు మహిళలు..!

-

Three powerful women leaders who are challenging modi

ఈరోజుల్లో స్త్రీ కూడా పురుషుడితో సమానంగా పోటీ పడుతోంది. పురుషుడు వేరు.. స్త్రీ వేరు కాదు. ఇప్పుడు అందరూ ఒకటే. ఉద్యోగంలోనైనా.. ఎక్కడైనా.. పురుషుడితో సమానంగానే కాదు.. ఇంకాస్త ఎక్కువే పోటీ పడుతోంది. ఇక… దేశ రాజకీయాలు తీసుకుంటే గనుక… ముగ్గురు మహిళలు.. ప్రధాన మంత్రి మోదీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయాలను లిఖిస్తున్నారు. మోదీ కూడా వాళ్లను చూసి భయపడిపోతున్నారు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు మహిళలు.. మీరు పైన ఫోటోలో చూస్తున్నారు కదా వాళ్లే.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి కదా. అందుకే ఎలాగైనా రెండో సారి కూడా అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ పార్టీ. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మోదీయే ప్రధాని. కానీ.. మోదీని ప్రధాని కాకుండా… బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయగలిగే సత్తా ఉన్నవాళ్లు ఈ ముగ్గురు మహిళలు.. వాళ్లే.. ప్రియాంకా గాంధీ, మమతా బెనర్జీ, మాయావతి. వీళ్లు ముగ్గురు ముగ్గురే. ఎవరికీ ఎవరు తీసిపోరు.

ప్రియాంకా గాంధీ.. తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇటీవలే మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అచ్చం ఇందిరా గాంధీలా ఉండే ప్రియాంకా.. ఇందిరా గాంధీలా రాజకీయాలను ఏలే చాన్స్ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. మరోవైపు మాయావతి.. ఆమె బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి. ఆమెకు రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. యూపీలో దళితులు, అణగారిన వర్గాలు ఆమె చెంతే ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న మాయావతి వచ్చే ఎన్నికల్లో యూపీలో తీవ్ర ప్రభావం చూపించనుంది.

ఇక.. మమతా బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆమె ఓ నియంత. 1997 లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి తృణముల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి.. కమ్యూనిస్టుల కంచుకోట అయిన వెస్ట్ బెంగాల్ లో వాళ్ల కోటను పెకిలించివేసి తన కోటను నిర్మించుకున్నది. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నది. అందుకే.. ఆమెతోటి కూడా సమస్యలు తప్పవని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు మాత్రం ప్రధాని మోదీని భయపెట్టిస్తున్నారు. మరి.. చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంత ప్రభావితం చేస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news