అత‌ని వ‌యస్సు 6 ఏళ్లు… వ‌రల్డ్ ఫేమ‌స్ హెయిర్ డ్రెస్స‌ర్ అయ్యాడు..!

-

సాధార‌ణంగా 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉన్న పిల్ల‌లు అంటే ఏం చేస్తారు ? ఆట పాట‌లు, ముద్దు ముద్దు మాట‌ల‌తో, అల్ల‌రి చిల్ల‌ర చేష్ట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంటారు. అంతేకదా.. కానీ చైనాకు చెందిన ఈ 6 ఏళ్ల బుడ‌త‌డు మాత్రం అలా కాదు. ప్ర‌పంచ దృష్టినే ఆకర్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా..? అత‌ను ఓ పాపుల‌ర్ హెయిర్ డ్రెస్స‌ర్ మ‌రి. మ‌నోడు కటింగ్ చేశాడంటే.. ఎంతటి వారైనా ఆశ్చ‌ర్య చ‌కితులు కావ‌ల్సిందే. ఈ క్ర‌మంలోనే అత‌ను మొత్తం చైనాలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు. ఎన్నో మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నాడు. ఇంత‌కీ ఆ బాలుడు ఎవ‌రంటే…

అత‌ని పేరు జియాంగ్ హోంగ్‌కి. వ‌య‌స్సు 6 సంవ‌త్స‌రాలు. ఉంటున్న‌ది చైనాలో.. మ‌నోడు ఈ వ‌య‌స్సులోనే పాపుల‌ర్ హెయిర్ స్టైలిస్ట్ అయిపోయాడు. అయితే అత‌ను ఇలా పాపుల‌ర్ అవ‌డానికి కార‌ణం అత‌ని తండ్రే అని చెప్ప‌వ‌చ్చు. ఎంద‌కంటే జియాంగ్ కు 4 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు అత‌ను త‌న తండ్రి సెలూన్‌లో చిన్న చిన్న ప‌నులు చేసేవాడు. దీంతో మ‌నోడికి అప్ప‌టి నుంచి ఈ రంగంపై ఆస‌క్తి పెరిగింది. దీంతో తండ్రి శిక్ష‌ణ‌లో మ‌నోడు రాటుదేలాడు. కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల కాలంలోనే పాపులర్ హెయిర్ డ్రెస్స‌ర్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే అత‌ని త‌ల్లిదండ్రులు అత‌ని ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ప్రారంభించారు. దీంతో జియాంగ్ అన‌తి కాలంలోనే పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు అత‌ను చైనాలోనే కాదు, ప్రపంప వ్యాప్తంగా సెల‌బ్రిటీ అయిపోయాడు. సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల మంది ఫాలోవర్లు జియాంగ్‌కు వ‌చ్చి చేరారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖులైన పిల్ల‌ల్లో ఇత‌ను కూడా ఒక‌డు అయిపోయాడు.

జియాంగ్ త‌ల్లిదండ్రులు 6 సంవ‌త్స‌రాల నుంచి ఈ బిజినెస్‌లో ఉన్నారు. దీంతో త‌మ కొడుక్కి ఆ రంగంలో స్కిల్స్ నేర్పించ‌డం వారికి పెద్ద క‌ష్టం కాలేదు. అయితే జియాంగ్ కూడా ఈ రంగంపై ఆస‌క్తి పెట్ట‌డంతో అత‌ను ఎంతో చ‌క్క‌గా అన్ని హెయిర్ స్టైల్స్ నైపుణ్యాల‌ను నేర్చుకోగ‌లిగాడు. దీంతో ఇప్పుడు త‌ల్లిదండ్రుల క‌న్నా అత‌నే పాపుల‌ర్ అయ్యాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జియాంగ్‌కు ఏకంగా 15 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్ల వ‌ర‌కు ఉన్నారు. ఏది ఏమైనా… జియాంగ్ ప్ర‌తిభ‌కు అత‌న్ని అంద‌రం అభినందించ‌క త‌ప్ప‌దు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news