ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగ ఇందులో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనుహ్యంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా.. 92 స్థానాలో విజయం సాధించి సింగిల్ గా అధికారాన్ని చేపట్టబోతుంది. కాగ పంజాబ్ సీఎం అభ్యర్థి గా భగవంత్ మాన్ సింగ్ ను ఎన్నికల ముందే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాగ నేడు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా భగవంత్ మాన్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారం.. పంజాబ్ రాష్ట్ర రాజధాని లో కాకుండా.. స్వాతంత్ర సమరయోదుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం అయినా.. ఖట్కాడ్ కలన్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం భగవంత్ మాన్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తాను ఒక్కరినే ప్రమాణ స్వీకారం చేయడం లేదని.. 3 కోట్ల పంజాబీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అన్నారు. భగత్ సింగ్ కలలు కన్న రంగ్లా పంజాబ్ ను చేసుకుందామని అన్నారు. కాగ ఈ కార్యక్రమానికి వచ్చే మగ వారు.. పసుపచ్చ రంగు తలపాగాలు ధరించాలని అన్నారు. అలాగే మహిళలు అదే రంగు గల దుప్పట్టా ను ధరించాలని కోరారు.