రష్యా, ఉక్రెయిన్ వార్ ప్రభావంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. దేశంలో కూడా త్వరలోనే పెట్రోల్, డిజిల్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో రష్యా.. ఇండియాకు సూపర్ ఆఫర్ ఇచ్చింది తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తామని తెలిపింది.
తాజాగా రష్యా క్రూడ్ ఆయిల్ ఆఫర్ పై తాజాగా అమెరికా స్పందించింది. ‘‘ భారత దేశం ఆంక్షలను ఉల్లంఘించదు కానీ… రష్యా ఆయిల్ డీల్ న్యూఢిల్లీ చరిత్రలో తప్పు వైపు ఉంచవచ్చు‘‘ అంటూ వ్యాఖ్యానించింది. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తే.. రష్యా దురాక్రమణకు కూడా మద్దతు ఇచ్చినట్లే అంటూ వ్యాఖ్యానించింది. చరిత్రలో మీరు ఏక్కడ ఉంటారో ఆలోచించుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల రష్యా ఇండియాకు చాలా తక్కువ ధరకే క్రూడ్ ఆయిన్ ఎగుమతి చేస్తామని ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఈ విషయం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. దీనిపై నోవాక్ కేంద్రమంత్రి హర్ధిప్ పూరికి ఫోన్ చేసి మాట్లాడారని తెలిసింది. అయితే రష్యా ఆఫర్ ను భారత్ స్వీకరించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే యూరోపియన్ దేశాలతో పాటు, అమెరికా, కెనడా దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ దేశాలతో భారత్ కు బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇటు రష్యా ఇచ్చే ఆఫర్ ను తీసుకుంటే దేశంలో ప్రజలకు తక్కువ ధరకు పెట్రోల్ ధరించే అవకాశం ఉంది.