ట్రైయాంగిల్‌గా మారిన ములుగు పోరు..అడ్వాంటేజ్ ఎవరికి?

-

ఇంతవరకు తెలంగాణ రాజకీయాల్లో ములుగు నియోజకవర్గం గురించి పెద్ద చర్చ లేదు. రాజకీయంగా అక్కడ డిస్కషన్ తక్కువ. కేవలం ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవా కార్యక్రమాల గురించే ఇంతవరకు చర్చ నడిచింది. ఎప్పుడు రాజకీయ పరమైన వ్యూహాలు, ప్రత్యర్ధుల అంశం తెరపైకి రాలేదు. కానీ ఎప్పుడైతే కే‌సి‌ఆర్..ములుగుకు బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా బడే నాగజ్యోతిని ప్రకటించారో..అప్పటినుంచి పోలిటికల్ ఫైట్ తీవ్రమైంది.

సీతక్కకు సరైన ప్రత్యర్ధి వచ్చారని బి‌ఆర్‌ఎస్ లో చర్చ మొదలైంది. సీతక్క వర్సెస్ నాగజ్యోతి పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరు ఒకే వర్గానికి చెందిన వారు..ఒకే బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. దీంతో పోరు హోరాహోరీగా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక ట్విస్ట్ వచ్చింది.  దివంగత మాజీ మంత్రి చందూలాల్‌ కుమారుడు, ములుగు మార్కెట్‌ కమిటీ మా జీ చైర్మన్‌ డాక్టర్‌ అజ్మీరా ప్రహ్లాద్‌ బీజేపీలో చేరనున్నారు.

చందులాల్ గతంలో టి‌డి‌పిలో పనిచేశారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2014లో గెలిచిన ఈయన..2018 ఎన్నికల్లో సీతక్క చేతిలో ఓడిపోయారు. తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారు. ఇక ఆయన తనయుడు ప్రహ్లాద్ బి‌ఆర్‌ఎస్ లో పనిచేశారు. కానీ ఆయన్ని కాదని కే‌సి‌ఆర్..జ్యోతికి సీటు ఇచ్చారు. దీంతో ప్రహ్లాద్ అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో బి‌జే‌పి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఇక సీటు ఫిక్స్ కావడంతో బి‌జే‌పిలో చేరడానికి ఆయన రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈనెల 12న ఆయన బి‌జే‌పి కండువా కప్పుకోనున్నారు. అయితే ములుగు బి‌జే‌పి నుంచి పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా జవహర్‌లాల్‌ తొలి దరఖాస్తును సమర్పించగా తాజాగా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి నాయక్‌, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ బి‌జే‌పిలోకి వస్తుండటంతో..ఆయనకే సీటు ఇస్తారనే చర్చ వస్తుంది.

ప్రహ్లాద్ బి‌జే‌పి నుంచి పోటీ చేస్తే గెలుపు అనేది కష్టమే..కానీ బి‌ఆర్‌ఎస్ ఓట్లు చీల్చి ఆ పార్టీకి నష్టం చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఆటోమేటిక్ గా సీతక్కకు అడ్వాంటేజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news