నిజామాబాద్ పేరు మారుస్తాం అన్న బీజేపీ కి సూపర్ సీక్రెట్ చెప్పిన టి‌ఆర్‌ఎస్..??

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతోంది. జరగబోయే ఎన్నికలలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని స్థాపించిన కేసీఆర్ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సరిగ్గా రాణించ లేని నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కూతురు కవిత ఓడిపోవడంతో ఆ ప్రాంతంలో బిజెపి పార్టీ గెలవడంతో తాజాగా నిజామాబాదు ప్రాంతం లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Related image

ఈ సందర్భంగా నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో నిజామాబాద్ పేరు మారుస్తామని హామీ ఇచ్చిన బిజెపి కి గెలిచేది టిఆర్ఎస్ పార్టీ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రాంతంలో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అని కచ్చితంగా నిజామాబాద్ పేరు మార్పు టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అంటూ టిఆర్ఎస్ పార్టీ వర్గాలు బిజెపి పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.

 

నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బిజెపి పార్టీ నేత ఎంపీ అరవింద్ ఇప్పటివరకు సరైన రీతిలో నిజామాబాద్ పార్లమెంటు లో స్థానాల్లో సరైన అభివృద్ధి చేయలేదని ఎంపీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మళ్లీ టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ మేయర్ స్థానాన్ని గెలిచి అభివృద్ధి చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news