టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం…. హ‌రీష్‌రావు సీఎం కావాల‌ని…!

-

ఎంత సర్ది చెప్పుకున్నా.. ఎవరు ఎన్ని వివరణలు ఇచ్చుకున్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి అంత సజావుగా లేద‌న్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఓవైపు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం… ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం… ఎర్రబెల్లి లాంటి నేతలు ఈట‌ల వ్యాఖ్య‌ల‌కు కౌంటర్‌గా మాట్లాడటం… మరోవైపు మహిళలను ఎవరిని కేబినెట్లోకి తీసుకోకపోవటం…. లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడం… నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవిత ఓడించేందుకు సొంత పార్టీకి చెందిన నేతలు పావులు క‌ద‌ప‌డం ఇలా అనేక కారణాలు టీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌తంగా ఉన్న అసమ్మ‌తిని తెలియ జేస్తున్నాయి.

trs leader vishnu wants to see harish rao as cm

తాజాగా ఓ టీఆర్ఎస్ నేత చేసిన పని ఇప్పుడు ఆ పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర‌ ప్రకంపనలు రేపుతోంది.హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగుళాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టారు. విష్ణు ఏ స్థాయి నాయకుడన్న‌ది కాసేపు ప‌క్క‌న పెడితే ఇది పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తోంది. హ‌రీష్‌రావును ద‌మ్మున్న లీడ‌ర్‌గా విష్ణు ఆకాశానికి ఎత్తేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హరీష్ రావు ఎంతో కష్టపడితే… ఆ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి హ‌రీష్‌రావును పిల‌వ‌క‌పోవ‌డం క‌రెక్ట్ కాద‌ని విష్ణు చెప్పారు. విష్ణు వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ మంట చల్లారేది కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన పరోక్ష వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ఇక ఎర్ర‌బెల్లి సైతం ఈట‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్య‌ల వెన‌క కేటీఆర్ ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత నెక్ట్స్ వార‌సుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న బాగా రైజ్ అవుతోంది. కేసీఆర్ కేటీఆర్ కోస‌మే హ‌రీష్‌ను సైడ్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హ‌రీష్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండ‌డంతో ఇప్పుడు ఆయ‌న సీఎం అవ్వాల‌న్న డిమాండ్ తెర‌మీద‌కు రావ‌డంతో భ‌విష్య‌త్తులో టీఆర్ఎస్ రాజ‌కీయం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news