చరిత్ర సృష్టిస్తా అంటున్న షర్మిల… మీ అవసరం లేదంటున్న మంత్రి…!

-

తెలంగాణా లో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడంతో అధికార తెరాస పార్టీ కూడా కంగారు పడుతుంది. తాజాగా ఖమ్మం జిల్లా నేతల తో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే నెల 9 న ఏర్పాటు చేయబోయే ఖమ్మం సభ గురించి మాట్లాడారు. ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ జరగాలి అని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ విధి విధానాలపై ఖమ్మం సభలోనే ప్రకటన ఉంటుంది అని తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి కి రెండు ప్రాంతాలు రెండు కళ్ళు లా ఉండేవి అని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు అభివృద్ధినీ వైఎస్సార్ కోరుకున్నారు అని చెప్పుకొచ్చారు. రాజన్న సంక్షేమ పాలన కోసమే నేను ముందుకు వచ్చాను అని ఆమె అన్నారు. షర్మిలమ్మ రాజ్యం కోసం నేను రాజకీయాల్లోకి రావడం లేదు అని స్పష్టం చేసారు. దొరల కుటుంబ పరిపాలన పోవాలి – రాజన్న పరిపాలన రావాలి అన్నారు.

ఖమ్మం జిల్లాలో పోడు భూములకు పట్టాలు వైఎస్సార్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణకు సీఎం కేసీఆరే తండ్రి అని, కోడలు షర్మిల రాష్ట్రానికి అవసరం లేదు అని స్పష్టం చేసారు. షర్మిల తెలంగాణ కోడలైతే బలవంతంగా ఆంధ్రలో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇప్పియ్యాలి అని కోరారు. ఏడు మండలాల కోసం షర్మిల పాదయాత్ర చేస్తే తెలంగాణ కోడలని నమ్ముతాం అన్నారు. వరంగల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది అని ఎద్దేవా చేసారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు

Read more RELATED
Recommended to you

Latest news