టీఎస్‌ఆర్టీసీ సమ్మెపై స్పందించిన కేంద్రం..

-

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. బీజేపీ ఎంపీలు ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆర్టీసీని, కార్మికులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు నితిన్ గడ్కరీని కలిశారు. ఆర్టీసీ సమ్మెపై త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని, వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news