తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది బిజెపి నేతలు రావచ్చు అనే ప్రచారం ఈ మధ్యకాలంలో జరుగుతుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో విభేదాలు ఉన్న కొంతమంది బీజేపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు. టిఆర్ఎస్ తమ పార్టీని ఏవిధంగా అయితే లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తుందో ఆయన కూడా అదేవిధంగా రాజకీయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను ఆయన ఎక్కువగా టార్గెట్ చేశారని సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గత వారం రోజుల నుంచి బండి సంజయ్ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం మద్దతు లభిస్తే కచ్చితంగా ఆయన ఈ విషయంలో ముందుకు వెళ్లవచ్చు అంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్ధి కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించారు అని సమాచారం.
టిఆర్ఎస్ పార్టీ బిజెపి నేతలను టార్గెట్ చేసింది కాబట్టి మనం కొంత మంది నేతలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక జాబితా కూడా బీజేపీ అధిష్టానం ముందు ఆయన పెట్టినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం ఆయనకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తే తుమ్మల నాగేశ్వరరావుని కలిసే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.