ఇద్ద‌రు మాజీ మంత్రుల‌కు త‌మ్ముళ్ల షాక్‌..!

ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు వారి త‌మ్ముళ్లు షాక్ ఇవ్వ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే వారు టీడీపీని వీడి ఒక‌రు బీజేపీలోకి, మ‌రొక‌రు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు త‌మ్ముడు స‌న్యాసినాయుడు త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేవిధంగా మ‌రో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇప్ప‌టికే అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న టీడీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది. ఉత్తరాంధ్రలో బలమైన నేతకోసం వెతుకుతున్న బీజేపీ మాజీ మంత్రి రంగారావుపై దృష్టి పెట్టింది. కానీ ఆయ‌న వైపు నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు. ఈ క్రమంలోనే టీడీపీతో అంటీ ము ట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయ‌న తమ్ముడు చిన్నరాజాగా పేరుగాంచిన బేబీ నాయనకు  వ‌ల‌వేసింది. ఇప్పటికే బేబినాయనతో బీజేపీ రాష్ట్ర అగ్ర నేతలు సంప్రదింపులు జరిపిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వర‌లోనే ఆయ‌న టీడీపీని వీడి బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య న్న‌పాత్రుడు త‌మ్ముడు స‌న్యాసినాయుడు వైసీపీ తీర్దం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. రానున్న స్థానిక ఎన్నిక‌ల్లో విశాఖ జిల్లాలో పాగా వేయాల‌ని భావిస్తున్న అధికార పార్టీ బ‌ల‌మైన నాయ‌కుల కోసం వెదుకుతోంది. ఈక్ర‌మంలోనే మంత్రి సోద‌రుడు స‌న్యాసిపాత్రుడు పార్టీలోకి ఆహ్వానించింది. వైసీపీ న ర్సీప‌ట్నం ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ గణేశ్ ద్వారా రాయ‌బారం న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం.

స‌న్యాసిపాత్రుడు కూడా వైసీపీలో చేరేందుకు స‌ముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు సైతం టీడీపీని వీడి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వైసీపీయో లేదా ?  బీజేపీలోకో వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. టీడీపీకి వ‌రుస షాకులు ఆగేలా లేవు.