వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్.. ఏపీకి సీఎం ఆయనే

-

ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేశారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి.ఏదో ఒక విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు ఈయన. మొత్తానికి ఏదో జరగబోతోంది అని హింట్ ఇస్తూ హడావుడి చేసేస్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో,ఇటు సామాజికంగా ఆయన పట్ల ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది జనాల్లో. ఆయన ఏం చెప్పినా సెన్సేషనల్ అంటూ కామెంట్లు పెట్టేస్తుంటారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశంపై అభ్యర్థుల్లోనూ ఓటు వేసిన ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంపై కుండబద్దలు కొట్టేశారు.

ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వేణు స్వామి. లక్ష సర్వేలు వచ్చినా, ఎంతమంది ఏకమై వచ్చినా ఏపీలో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కుతాయని మళ్లీ సీఎం గా జగన్ ఉంటారని తేల్చిచెప్పేశారు.ఏదైనా ఒక అంశంపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే ఈయన ఈసారి సీఎం ఎవరో కంఫర్మ్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీశారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. ఇలాంటి క్రమంలో అధికారం వైసీపీదే అని ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.తాజాగా వేణు స్వామి కామెంట్లు వైసీపీ శ్రేణులకు మరింత ఆనందాన్నిచ్చాయి.

2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మూడేళ్ల పాటు సైలెంట్‌గా ఉండాలని సలహా ఇచ్చానని వేణు స్వామి చెప్పారు. చివరి రెండేళ్లలో మాత్రమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పానంటూ గుర్తు చేశారు. జగన్ సీఎం కుర్చీలో కూర్చుంది మొదలు ప్రభుత్వం పడిపోతుందంటూ టీడీపీ ప్రచారం చేసిందని ఆ తప్పుడు ప్రచారమే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయ్యిందని అన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు కూడా టీడీపీకే గెలిచే అవకాశం ఉండగా ఆ పార్టీ మరో రెండు పార్టీలతో జత కట్టడం వల్లే సీన్ మొత్తం మారిందని కామెంట్ చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ గెలుపు ఆపలేరని వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైసీపీకి ఇది మరింతగా బూస్ట్ ఇచ్చే పరిణామమే అనుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news