ఇలాంటి పనులు చేసి జగన్ ని ఇంకా ఇంకా బ్యాడ్ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి !

-

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న తరుణంలో దేశంలో కూడా ఈ వ్యాధి ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించారు. Image result for nimmagada ramesh kumar vijay sai reddyదీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల కమిషనర్ పై సీరియస్ అయ్యారు. ఇదే తరుణంలో వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయం గురించి ఇటీవల విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఉద్దేశించి…కుక్క, గబ్బిలం అనే పదాలు నేరుగా వాడకుండా ఇండైరెక్టుగా వాడుతూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడం జరిగింది. దీంతో విజయసాయి రెడ్డి విమర్శించడం పట్ల  సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

 

మరోపక్క వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అప్పట్లో రాజధాని బిల్లు విషయంలో శాసనమండలిలో విజయసాయిరెడ్డి ఓవర్ థింక్ చేసి పీకల దాకా తీసుకు వచ్చాడు, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అప్పగించిన పార్టీ నిండా ముంచే విధంగా రమేష్ కుమార్ ని గుర్తించలేకపోయాడు మొత్తంమీద చూసుకుంటే పిచ్చి పనులు చేసి జగన్ ని విజయ సాయి రెడ్డి బ్యాడ్ చేస్తున్నారని లోలోపల గుసగుసలాడుతున్నారు. ఎన్నికల వాయిదా అనివార్యమైతే ఖచ్చితంగా ఐదువేల కోట్లు రాష్ట్రం నష్టపోతుంది అని వైసీపీ నేతలు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news